Site icon NTV Telugu

అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం…

cm-jagan

స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారుల పని తీరు పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ… గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్‌ చేసుకోవాలి. వీటి సమర్థ మెరుగుపడాలంటే ఇనస్పెక్షన్‌ జరగాలి. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు ఇనస్పెక్షన్లు చేయాలి. వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్‌కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి 4 సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించమని చెప్పాం. 733 ఇనస్పెక్షన్లు మాత్రమే జరిగాయి. 66.75శాతం మాత్రమే ఇనస్పెక్షన్లు చేశారు. కలెక్టర్లు 106శాతం, జేసీలు ( గ్రామ సచివాలయాలు) 107 శాతం ఇనస్పెక్షన్లు చేశారు. వీరంతా బాగానే ఇనస్పెక్షన్లు చేశారు. కాని మిగిలిన వారు సరిగ్గా చేయలేదు అన్నారు.

జేసీ రెవిన్యూ 78శాతం, జేసీ హౌసింగ్‌49శాతం, జేసీ ( ఏ అండ్‌ డబ్ల్యూ) 85శాతం, కార్పొరేషన్లలో మున్సిపల్‌కమిషనర్లు 89శాతం, ఐటీడీఏ పీఓలు 18శాతం, సబ్‌కలెక్టర్లు 21శాతమే ఇనస్పెక్షన్లు చేశారు. వీరి ఫెర్మానెన్స్‌ చాలా బ్యాడ్‌గా ఉంది: వీరికి మెమోలు జారీచేయమని ఆదేశాలు జారీచేశాను. వీరు ఇనస్పెక్షన్లు చేయకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి. సకాలంలో పెన్షన్లు వస్తున్నాయా? రేషన్‌కార్డులు వస్తున్నాయా? లేదా అని ఎవరికి తెలుస్తుంది అన్నారు సీఎం. తప్పులు జరిగాయని తెలిస్తే.. వాటిని రిపేరు చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు వెళ్లకపోతే.. ఎలా తెలుస్తాయి. మొదట మనం మనుషులం.. ఆతర్వాతే అధికారులం. మానవత్వం చూపడం అనేదిమన ప్రాథమిక విధి. పేదల గురించి మొదట మనం ఆలోచించాలి. వచ్చే స్పందన నాటిని నిర్దేశించిన విధంగా నూటికి నూరుశాతం గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షణ చేయాలి అని పేర్కొన్నారు.

Exit mobile version