NTV Telugu Site icon

CM Jagan: టెన్త్ పేపర్లు లీక్ చేసింది శ్రీచైతన్య, నారాయణ కాలేజీ వాళ్లే

Cm Jagan

Cm Jagan

ఏపీలో పదో తరగతి పరీక్షల పేపర్లు వరుసగా లీక్ అవుతుండటంపై సీఎం జగన్ స్పందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని.. రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి లీక్ అయ్యాయని.. మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని జగన్ ఆరోపించారు. వీళ్ళే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని.. వాట్సాప్ ద్వారా పేపర్‌లను బయటకు పంపి భయాందోళనలకు గురి చేయాలని చూశారని జగన్ విమర్శలు చేశారు. పేపర్ లీకులపై కొందరు దొంగ నాటకాలు ఆడుతున్నారని.. నారాయణ స్కూల్ ఎవరిదో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. ఆ స్కూల్ టీడీపీ నేతది కాదా అని సీఎం ప్రశ్నించారు.

మరోవైపు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో, గుంటూరు, విశాఖలో జరిగిన అత్యాచార ఘటనల్లో నిందితులందరూ టీడీపీకి చెందిన వారే అని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ నిందితుల గురించి చంద్రబాబుకు మద్దతు పలికే మీడియా సంస్థలు రాయబోవని.. ఆ ఘటనలను వక్రీకరించి కథనాలు అందిస్తున్నారని జగన్ విమర్శించారు. ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఏడుకొండలవాడిని కోరుకుంటున్నానని జగన్ అన్నారు. టీడీపీ నేతలు గుడులను ధ్వంసం చేస్తే మనం గుడులు కట్టామని.. వాళ్లు రథాలను తగలబెడితే మనం రథాలను నిర్మిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

CM Jagan : మన తలరాతను మార్చే శక్తి చదువులకు మాత్రమే ఉంది

Show comments