శ్రీకాకుళం : డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో క్రీడలు ఎంతో దయనీయస్థితిలో ఉండేవని… ప్రస్తుతం క్రీడలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియ జేశారు. క్రీడలు నేటికీ నిరాదరణకు గురవుతున్నాయనేది తన వ్యక్తిగత అభిప్రాయమని… ఈ విషయం పై ఎవరు ఏమనుకున్నా పర్వాలేదన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని… వైద్యం కోసం వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. క్రీడల కోసం కొంత ఖర్చు చేస్తే … వైద్యానికి పెట్టే ఖర్చు కొంత తగ్గుతుందనేది తన భావన అని తెలిపారు.
క్రీడలకు ఖర్చు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని… ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే క్రీడాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమాజం పట్ల గౌరవం , క్రమశిక్షణ ఒక్క క్రీడాకారుడికే ఉంటాయని… ఉపముఖ్యమంత్రిగా కంటే క్రీడలంటే నాకు చాలా ఇష్టమన్నారు. ఏపీలోని అన్ని జిల్లాలకు క్రీడాకారుడిగానే కృష్ణదాస్ అంటే తెలుసు అని వెల్లడించారు. క్రీడలతోనే తనకు గుర్తింపు వచ్చిందని… స్కూల్లో పాస్ మార్కులు వస్తే చాలనుకునేవాడిని అని తెలిపారు. ఆటల కోసమే విశాఖ వెళ్లి డిగ్రీలో చేరానని… క్రీడాకారుడిని కావడం వల్లే తనకు ఉద్యోగం, డిగ్రీలు వచ్చాయని వెల్లడించారు.
