ఏపీ సీఎం జగన్ తన పర్యటనలో ఎప్పుడూ అంబులెన్స్ లను దాటి పోలేదు. తాను ఎంత బిజీగా వున్నా. తన కాన్వాయ్ వెళుతున్న మార్గంలో అంబులెన్స్ సైరన్ వినిపిస్తే పక్కకి ఆపి దారిచ్చేవారు. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్. 108 అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ని పక్కకి జరిపిన సీఎం జగన్. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి వెళుతుండగా ఎనికేపాడు వద్ద ఘటన జరిగింది. రోడ్డుమీద 108 అంబులెన్స్ ను చూడగానే స్పందించిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని ఆపేశారు. అంబులెన్స్‌కి దారిచ్చారు.
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న జగన్
