Site icon NTV Telugu

CM Chandrababu: కాసేపట్లో పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు..

Pawan

Pawan

CM Chandrababu: వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు- పవన్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Sunil Gavaskar: సూర్య ఎందుకిలా..? టీమిండియా కెప్టెన్ పై దిగ్గజ ఆటగాడు ఫైర్

అయితే, ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా, ఈ అంశంపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం గమనార్హం. అలాగే, శాసన సభ సమావేశాల్లో పవన్‌పై బొండా ఉమ చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు- పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Exit mobile version