Site icon NTV Telugu

CM Chandrababu: రాష్ట్రంలో రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. గుంతలు కనిపించొద్దని ఆదేశాలు..

Cbn

Cbn

CM Chandrababu: రాష్ట్ర రహదారుల పురోగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్నగొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో గుంతలు కనిపించకుండా చూడాలని ఆదేశించారు. రహదారుల మరమ్మత్తుల విషయంలో ఎలాంటి రాజీ పడొద్దన్నారు. పనులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని మంత్రికి సూచించారు. మిషన్ పాత్ హోల్ ఫ్రీ కార్యక్రమం గత ఏడాది ఈ కార్యక్రమం చేపట్టి రూ. 861 కోట్లతో పనులు పూర్తి చేశామని తెలిపారు.

Read Also: Sand Mafia : చెక్ డ్యాంను రాత్రికి రాత్రి కూల్చివేసిన దుండగులు,

అలాగే, ఈ ఏడాది రహదారుల అభివృద్ధి కోసం రూ. 2500 కోట్లతో పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రూ. 400 కోట్లు నాబార్డ్ నిధులతో 1,250 కిలోమీటర్ల జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధికి 191 పనులు చేపట్టనున్నారు. రూ. 600 కోట్లు మూలధన వ్యయం కింద 227 పనులు మంజూరు చేశారు. మొత్తం 1,450 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి కం గుత్తేదారులకు పనులు అప్పగింత ఒక్క సంవత్సరం లోనే చారిత్రాత్మక మైలురాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రూ. 2500 కోట్లతో 5471 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి అనుమతులు ఇవ్వడం గర్వకారణమన్నారు. మోంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న 4794 కిలోమీటర్ల రహదారులను అత్యవసరంగా మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రహదారుల పనులకు రూ. 4000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, అందులో ఇప్పటివరకు రూ. 1900 కోట్లు చెల్లించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Exit mobile version