NTV Telugu Site icon

AP CM React on SC Classification: ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Babu

Babu

AP CM React on SC Classification: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సున్నిపెంట సభలో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఎస్సీ కులాలను ఏబీసీడీ వర్గీకరణ సబబు అని చెప్పింది.. 1996-97 ప్రాంతంలో ఎస్సీ వర్గీకరణ చేశా.. సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పుకొచ్చారు. దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలి అనేదే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం.. నాడు కమిటీ వేసి ఎస్సీ వర్గీకరణ తెచ్చాం.. నేడు సుప్రీం కోర్టు దాన్ని ధృవీకరించింది.. ప్రతి కులానికి, ప్రతి వర్గానికీ న్యాయం చేయటమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Read Also: Wayanad landslide: వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక పర్యటన.. బాధితుల పరామర్శ

ఇక, ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం.. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ఎజెండా అని మంత్రి లోకేశ్ తెలిపారు.

Read Also: First Mobile Phone Call: భారత్‌లో మొట్టమొదటి మొబైల్ కాల్‌కి 30 ఏళ్లు.. తొలి కాల్ ఎవరు ఎవరికి చేశారో తెలుసా..?

కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఎమ్ఆర్పీఎస్స్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశంసించారు. వర్గీకరణ చేసేలా చూసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నా.. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది.. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమైంది.. వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ ఆయన చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.. రీ నోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు.