ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సన్మాన సభలో… సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ చలోక్తులు విసిరారు. సెల్ఫీలు, బొకేలు, శాలువా కప్పి ఫోటోలు తీసుకోవడం పై తాపత్రయం వద్దని ఎన్వీ రమణ పేర్కొన్నారు. నేను ఇక్కడి వాడిని… నేను సినిమా హీరోను కాదంటూ ఎన్.వి.రమణ తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారే రిటైర్మెంట్ తర్వాత చూస్తామని పేర్కొన్నారు.
రెండు రోజుల నుంచి వరుస కార్యక్రమాలు జరుగుతున్నాయి… తెలంగాణ హైకోర్టు సీజే వెళ్లిపోయారని తెలిపారు. మిగితా వారు కూడా వెళ్లి పోక ముందే… ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని కోరారు సీజే ఎన్.వి.రమణ. ఇక అంతకు మందు ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లు మనముందు ఉన్నాయని.. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని వెల్లడించారు. కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిందని.. న్యాయవ్యవస్థ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొందన్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆర్థిక సంస్కరణలు వచ్చాయని స్పష్టం చేశారు సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ.
