NTV Telugu Site icon

Leopard Case: చిరుత మృతి కేసులో పురోగతి.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు..

Dfo

Dfo

Leopard Case: చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, వారి నుంచి చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు డీఎఫ్‌వో భరణి.. తాళ్తమడుగు గ్రామం వెతలచేను అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు వన్యప్రాణులను చంపడానికి పొలం వద్ద విద్యుత్‌ తీగలను అమర్చినట్లు గుర్తించామని వెల్లడించారు.. అయితే, అడవి జంతువులను వేటాడడానికి వేసిన అక్రమ విద్యుత్ వైర్ల ఉచ్చులో పడి చిరుత దెబ్బతిని అచేతన స్థితిలోకి వెళ్లిపోయిందని.. ఆ తర్వాత పులిని హింసించి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి అయ్యిందన్నారు.. చిరుతను చంపిన కేసులో బంగారుపాళ్యం వెలుతురుచేనుకు చెందిని ఇద్దరు సహా ఐదుగురు అనుమానితులను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేశాం.. వారి వద్ద నుంచి చిరుత పులి కాళ్లు, గోళ్లు, దంతాలను స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎఫ్‌వో భరణి.. అయితే, ఈ కేసులో విచారణ పూర్తి అయిన తర్వాత మొత్తం వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.. ఎవరైనా వన్యప్రాణులను చంపడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎఫ్‌వో..

Read Also: Minister Narayana: దాచేప‌ల్లిలో డ‌యేరియాపై మంత్రి నారాయణ సమీక్ష..