Site icon NTV Telugu

Deputy CM Pawan: ఏనుగుల దాడిలో రైతు మృతి.. ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి!

Pawan

Pawan

Deputy CM Pawan: చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరులో ఏనుగుల గుంపు దాడిలో రైతు రామకృష్ణమరాజు మృతి చెందాడు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని కదిలెంచబోమని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఘటన స్థలానికి చిత్తూరు డీఎఫ్ఓ బయలుదేరి వెళ్లారు. రాత్రి నుంచి మృతదేహం తరలించడానికి స్థానికులు నిరాకరిస్తున్నారు. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే రామకృష్ణమరాజు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించేది లేదని తేల్చి చెప్పారు.

Read Also: HHVM : హరిహర వీరమల్లు ఉచిత ప్రదర్శనలు..

ఇక, చిత్తూరు జిల్లా అవులపల్లె పంచాయతీ కొత్తూరుకు చెందిన రైతు రామకృష్ణంరాజు ఏనుగుల గుంపు దాడిలో దుర్మరణం పాలైన విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చింతించారు. బాధాకరమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ అధికారుల నుంచి తెలుసుకున్నాను.. ఏనుగుల గుంపు వెళ్తున్న మార్గాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, ఆయా ప్రాంతాల రైతులకి ముందుగా సమాచారం అందించాలని దిశా నిర్దేశం చేశారు.. రామకృష్ణంరాజు కుటుంబాన్ని అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం పరామర్శించి పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Exit mobile version