Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: ఎనుగులకు చెక్..! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహం.. యాక్షన్‌ ప్లాన్‌ రెడీ..!

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: ఉమ్మడి చిత్తూరు అంటే గజరాజు దాడుల గుర్తుకు రావడం గత కోన్నేళ్ళుగా మారింది‌.. వన్యప్రాణి సంపదకు చక్కటి నెలవు చిత్తూరు జిల్లా.. ఈ జిల్లా పరిధిలోని వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి అయితే వేసవి వచ్చిందంటే ఈ వన్యప్రాణులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యేకించి గజరాజులకు కొండంత కష్టం వస్తుంది. జిల్లా పరిధిలో తూర్పున శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, పశ్చిమాన కౌండిన్య అభయారణ్యంలో వందల సంఖ్యలో ఏనుగులు ఉన్నాయి. ఇందులో కౌండిన్య అభయారణ్యం రాష్ట్రంలోనే ప్రముఖ ఏనుగు సంరక్షణ కేంద్రంగా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లాతో.. ఇటు తమిళనాడు అటు కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. మూడు రాష్ట్రాల సరిహద్దులోని ఈ కౌండిన్య అభయారణ్యం సుమారుగా 357 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 88,500 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. గజరాజులకు ఈ అభయారణ్యమే ఆవాసం. అయితే, గడిచిన కొన్ని సంవత్సరాలగా అడవిలో నుంచి ఏనుగులు జనావాసాల్లోకి తరచుగా వస్తున్నాయి. రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. దీంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Read Also: Crime News: అంబర్ పేట్‌లో దారుణం.. భార్యపై కన్నేశాడని స్నేహితుడిని..!

ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా గ్రామస్తులు రాత్రంతా జాగారం చేస్తున్నారు. ఏనుగుల నుంచి తమ పొలాలను కాపాడుకునేందుకు ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలను పాటిస్తున్నారు. అడవి నుంచి దారి తప్పి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులు… ప్రజలను చూసి కంగారు పడుతున్నాయి. తమ పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులపై రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏనుగులు, రైతుల మధ్య జరుగుతున్న ఈ సమరంలో పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోయారు… ఏనుగులు కరెంటు షాక్ సహా రోడ్డు ప్రమాదాలు వల్ల ముప్పై వరకు చనిపోయాయి‌.. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక గజరాజులను కంట్రోల్ చేయడానికి కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొని వచ్చారు ఇప్పటికే అవి ట్రైన్ అయ్యి తమ తొలి ఆపరేషన్ సైతం సక్సెస్ పుల్ గా చేశాయి… అయితే, గజరాజులు ఒకచోట నుంచి ఇంకోచోటకు కుంకీ ఏనుగులను తీసుకుని వెళ్లాలంటే మాత్రం సమయం కూడా ఎక్కువ అయ్యే ఎటువంటి పరిస్థితి ఉంటుంది.. ఉదాహరణకు చంద్రగిరిలో దాడులు జరిగితే కుంకీ ఏనుగులు పలమనేరు నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు ఆరేడు గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది ఈలోగా ఏనుగులు వచ్చి దాడులు చేయడం పంటను నాశనం చేయడం జరిగిపోతుంటాయి..

Read Also: Anantapur: సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోత్సవ సభ.. ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు..

దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కుంకీలు సమర్థవంతంగా పనిచేస్తున్న దూరంగా జరిగేటువంటి దాడులను అరికట్టడానికే తగిన విధంగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం,అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సూచనలతో సరికొత్త ప్రణాళికలను రూపొందించింది తిరుపతి జిల్లా అటవీశాఖ… జిల్లాలో రైతులు, ప్రజలను భయపెడుతున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖ నడుం బిగించింది. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అలాగే తిరుమల అడవుల్లో చిరుతల కదలికలను కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.జిల్లాలో ఏనుగుల కదలికలపై ముందస్తు సమాచారం కోసం అటవీ శాఖ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ సాంకేతికతను ఉపయోగించనుంది. దీని ద్వారా ఏనుగులు అటవీ ప్రాంతం నుండి పరిసర గ్రామాలకు ఒక కిలోమీటర్ దూరంలోకి రాగానే ప్రజల మొబైల్ ఫోన్‌లకు ‘‘ఏనుగులు వస్తున్నాయి, జాగ్రత్త’’ అంటూ మెసేజ్‌లు పంపిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందం నిరంతర నిఘా కొనసాగిస్తుంది. వాటితో పాటు డ్రోన్లు, జీపీఎస్ పరికరాలు ఉపయోగించి ఏనుగుల కదలికలను అంచనా వేస్తారు. వాట్సాప్, లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామ ప్రజలకు సమాచారం అందిస్తారు.

Read Also: Hardik Pandya: హార్దిక్ వాచ్ ధర అన్ని కోట్లా.. ఆసియా కప్‌ ప్రైజ్‌ మనీకి 10 రెట్లు!

ఇన్‌ఫ్రారెడ్, థర్మల్ సెన్సార్లతో కూడిన సౌరశక్తితో నడిచే స్మార్ట్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ, పోలీసులు, రెవెన్యూ, విద్యుత్, రైల్వే శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు. వాటితో పాటు AI ఆధారిత పర్యవేక్షణ, ప్రిడిక్టివ్ అనాలిసిస్.. డ్రోన్ నిఘా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక, ఏర్పాటు చేసిన టెక్నాలజీ సత్ఫలితాలిస్తోంది. ఇప్పటికే జిల్లా అటవీప్రాంతం లోపల అటవీశాఖ ఎనుగుల సంచారాన్ని గుర్తించింది. కెమెరాలలో ఎనుగులు గుంపు దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక్క తిరుపతి కాకుండా చిత్తూరు, అన్నమయ్య డివిజన్లలో డే అండ్ నైట్ పర్యవేక్షణ, డ్రోన్లు, GPS, గూగుల్ మ్యాపింగ్ ద్వారా ఏనుగుల కదలికల అంచనా వేస్తున్నారు. ఏనుగు దాడులను అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. తాజా లెక్కలు ప్రకారం ఒక్క తిరుపతి డివిజన్‌లో 40కిపైగా ఏనుగులు ఉన్నట్లుగా గుర్తించారు. ఉమ్మడి జిల్లా లో వాటి సంఖ్య వందకుపైగా ఉంటుంది సమాచారం… అలా డ్రోన్ కెమెరా, ట్రాప్ కెమెరాల్లోనూ ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో టెక్నాలజీ సహాయంతో ఏనుగులను అటవీ శాఖ గుర్తించినటువంటి నేపథ్యంలో ఆ వీడియోలను చూసినటువంటి రైతులు మాత్రం టెక్నాలజీతో వాటి దాడులను అడ్డుకుంటే అదే మాకు పెద్ద వరం అంటున్నారు.. మరి చూడాలి తాజాగా అటవీ శాఖ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి మరి..

Exit mobile version