NTV Telugu Site icon

Free Bus Scheme in AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..

Jagan Mohan

Jagan Mohan

Free Bus Scheme in AP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎప్పుడు ప్రారంభం అవుతుందనే చర్చ సాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడారు.. అయితే, మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అయ్యే రోజు రానే వచ్చింది.. మహిళలకు ఉచిత బస్సు పథకంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కీలక ప్రకటన చేశారు. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులోకి వస్తుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటు పడుతున్నారని.. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని చెప్పారు గురజాల జగన్‌ మోహన్‌..

Read Also: Honda Activa 7G Launch: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్‌ తెలిస్తే మైండ్ బ్లాకే!

పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగన్‌ మోహన్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెలు బాగుంటేనే అంతా బాగుంటుందని నమ్మే వ్యక్తి సీఎం చంద్రబాబు అన్నారు.. పల్లె నుంచి సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు.. అందుకే ఆయనది మంచి మనసు అన్నారు.. గత ఐదేళ్ల కాలంలో ఏ ఒక్క నాయకుడైనా వచ్చి.. మీ సమస్యలు అడిగి తెలుసుకున్నాడా? అని ప్రశ్నించారు.. మేం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.. ఇప్పటికే పెన్షన్‌ ఇస్తున్నాం.. దీపావళి నుంచి మీకు సిలిండర్లు ఇస్తాం.. ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలు అవుతుందన్నారు.. ప్రతీ 6 నెలలకు ఓసారి గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం అన్నారు.. దీపావళికి ఉచిత సిలిండర్ అమలు చేస్తామని, ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్సు అమల్లోకి తెస్తామని వెల్లడించారు.. మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటు పడుతున్నారు.. పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు, మరిన్ని పెన్షన్లు ఇస్తామని తెలిపారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.

Show comments