NTV Telugu Site icon

పేదోళ్ళ చెమటను జలగల్లా లాగేస్తున్నారు.. చింతమనేని ఆగ్రహం

పశ్చిమగోదావరి జిల్లాలో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి నగర పంచాయతీల ఎన్నికలు. జిల్లాలో ఆచంట తర్వాత టెన్షన్ పెట్టిస్తోంది ఆకివీడు నగర పంచాయతీ. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు ఆకివీడుని ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకుంటున్నాయి. ఆయా పార్టీల అగ్రశ్రేణి నేతలు నగర పంచాయతీపై ఫోకస్ పెట్టారు. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్‌ చింతమనేని ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు.

పేదవారి చెమటని బ్రాందీ రూపంలో లాగేసుకున్న వ్యక్తి ఈ దేశంలోఎవరూ లేరు.ఒక్క జగన్ మోహన్ రెడ్డి తప్ప అన్నారు. ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇంత ప్రమాదానికి దారితీస్తుందని ఎవ్వరూ ఊహించలేదన్నారు. అమ్మ ఒడి 14 వేలు ఇస్తే బాబు జేబులోంచి లక్ష రూపాయలు లాగిస్తున్నావన్నారు.

ఇళ్ల స్థలాలు ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్న జగన్.. నీ బాత్రూమ్ ఎంత ఉందో పేదవాడికి ఇచ్చిన ఇంటి స్థలం అంత ఉందని చింతమనేని ఎద్దేవా చేశారు. కాసులకు కక్కుర్తిపడి పేద ప్రజలను మభ్య పెడతారా? ఇదేనా మీ పరిపాలన అని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.