NTV Telugu Site icon

Shivshankar Wife Protest: నిత్య పెళ్ళికొడుకు సొంతూళ్ళో భార్య ఝాన్సీ నిరసన

Jhasi Gnr

Jhasi Gnr

ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 13 మందిని పెళ్ళి చేసుకున్న నిత్య పెళ్ళికొడుకు శివశంకర్ అరెస్టై జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అతని చేతిలో మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో నిత్య పెళ్ళికొడుకు అడపా శివశంకర్ బాధితురాలు, అతని భార్య ఝాన్సీ అతని స్వగ్రామమైన బేతపూడికి వచ్చి ఆ గ్రామంలో తన బాధను తన డిమాండ్లను పాంప్లెట్ రూపంలో ముద్రించి అందరికీ పంచింది. అతని మొదటి భార్య తో సహా అతని కుటుంబ సభ్యులకు బంధువులకు గ్రామస్తులకు పంచి తన డిమాండ్ ను తెలియజేసింది. తనను ఎలా మోసగించాడో అందరికీ వివరించింది.

Shivashankar 13 Marriages: 11 కాదు 13.. శివశంకర్ పెళ్లిళ్ళ కథ

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కలుగ చేసుకొని శివశంకర్‌ చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలని అప్పటివరకు తను అత్తగారిల్లు అయిన బేతపూడి లోనే ఉంటానంటోంది. మొదటి భార్య, అలాగే తనకు కూడా అతని ఆస్తుల్లో సమాన హక్కు ఉందని చట్టప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని వాపోయింది. తనను మానసికంగా వేధిస్తున్నాడని తనకు సహకరించిన వారితో తనకు ఆక్రము సంబంధం ఉందని ఆరోపణలు చేస్తూ తనకు ఎవరూ సహకరించకుండా వేధిస్తున్నాడని ఝాన్సీ ఆరోపించింది.

అందరూ భార్యలలాగే తన కూడా తన తల్లి గారి ద్వారా వచ్చిన బంగారం, తన సోదరి నుంచి కొంత నగదు ఆపదలో ఉన్నానంటే అతనికి ఇచ్చానని నమ్మించి మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని వేడుకొంది. అతని స్వగ్రామమైన బేతపూడిలో మొదటి భార్యతో కలిసి జీవనం కొనసాగిస్తానని తెలిపింది.