Beach Corridor Project: కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ ఏర్పాటు చేయాలనుకున్న బీచ్ కారిడార్ గ్రీన్ బెల్ట్ నిబంధనల్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఈ మేరకు ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది.. 10 మీటర్ల గ్రీన్ బెల్ట్ ఏర్పాటు కోసం గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే కాగా.. కైలాసగిరి జంక్షన్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకూ బీచ్ కారిడార్ లో భాగంగా 10 మీటర్ల వెడల్పున గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు.. గ్రీన్ బెల్టు పరిధిలోకి వచ్చే భూములను ప్రైవేటు యజమానులు వీఎంఆర్డీఏకు అప్పగించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఐఎన్ఎస్ కళింగ, ఎర్రమట్టి దిబ్బలు, రిజర్వు ఫారెస్టు, కొండలు ఉన్న చోట్ల మాత్రం గ్రీన్ బెల్ట్ నిబంధనలకు మినహాయింపు ఇస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది సర్కార్.
Read Also: R 5 zone: ఆర్ 5 జోన్ విషయంలో ముందడుగు.. గెజిట్ జారీ చేసిన ఏపీ సర్కార్