ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు.. రాష్ట్రంలో పలు కార్యక్రమాలతో పాటు.. హస్తినబాట పడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొనాల్సి కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. చివరకు ఈ నెల 7వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం సమయాన్ని కూడా మార్చేశారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. ఈ మార్పులు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. 6వ తేదీన సీఎం జగన్ పాల్గొనాల్సిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమం 7వ తేదీకి వాయిదా వేశారు అధికారులు.. 7వ తేదీ ఉదయం నరసరావుపేటలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్.. దీంతో అదే రోజు ఉదయం 11 గంటలకు జరగాల్సిన కేబినెట్ భేటీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. కాగా, రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి నిధుల విషయంపై చర్చిస్తారని సమాచారం.. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.. ప్రధాని మోడీతో సమావేశం తర్వాత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
Read Also: Rain Alert: తెలంగాణకు వర్ష సూచన.. 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
