అమరావతి : జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ ఎస్సీ నేతలతో చంద్రబాబు సమావేశo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీల్లో యువ నాయకత్వం రావాలని… వైసీపీ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్ ఎస్సీలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని… అధికారంలోకి వచ్చాక నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన వర్గాలపైనే జగన్ దాడులు చేయిస్తూ.. వారిపై అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. జగన్ రెడ్డి విధ్వంసకర పాలన పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని… జగన్ అరాచకపాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఎవరికీ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు : చంద్రబాబు
