Site icon NTV Telugu

రోశయ్య కంఠం మారుమోగుతూనే వుంటుంది..చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు అన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. ఆయన వాగ్దాటి, కంచుకంఠం మారుమోగుతూనే వుంటుందన్నారు చంద్రబాబు. ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని బాబు గుర్తుచేసుకున్నారు. ఏ పదవిలో ఉన్నా రాణించిన వ్యక్తి రోశయ్య. ఆయన అజాత శత్రువు.కాంగ్రెస్ పార్టీకి రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారు.

క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకం.16 సార్లు బడ్జెట్ పెట్టిన చరిత్ర రోశయ్యది.రాజకీయంగా రోశయ్యతో విభేదించే వాళ్ళం.. కానీ ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి.ఒక ఇష్యూ తీసుకుంటే దాన్ని సమర్ధవంతగా నిర్వహించేవారు.రోశయ్య ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ లాంటి వారు.రోశయ్య కంఠం తెలుగు ప్రజలు మరిచిపోలేరని బాబు నివాళులర్పించారు.

Exit mobile version