ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu). పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. స్ట్రాటజీ కమిటీ భేటీలో చంద్రబాబు జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై సీఎం జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారు..? కేంద్ర ప్రభుత్వ వ్యవస్థల నుంచి నిపుణల నివేదికల వరకూ జగన్ ప్రభుత్వానిదే తప్పని తేల్చారు.
పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను పీపీఏ (PPA), కేంద్రం, నిపుణుల కమిటీ తేల్చి చెప్పాయి. పోలవరం పరిహారంపై నాటి జగన్ హామీలు ఏమయ్యాయి..? పేదలకు ఇచ్చింది జగనన్న కాలనీలు కాదు.. జలగన్న కాలనీలు. రాష్ట్రంలో బడులు మూస్తున్నారు.. బార్లు తెరుస్తున్నారు. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నూరు శాతం విఫలం అయిందన్నారు చంద్రబాబు.
Rashmika Mandanna: నన్ను ప్రేక్షకులు అలా చూడడానికి ఒప్పుకోరు అని చెప్పా.. అయినా
2014లో నా ప్రయత్నం కారణంగా ఏపీలో చేరిన పోలవరం విలీన గ్రామాలు.. ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఖరితో మళ్లీ తెలంగాణలో కలపాలనే డిమాండ్ చేస్తున్నాయి. పోలవరం ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం పై జగన్ ఇచ్చిన హామీలు, పునరావాస కాలనీల నిర్మాణం ఏమయ్యాయి. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో విద్యాశాఖ దారుణంగా విఫలమైంది. రాష్ట్రంలో బడులను విలీనం పేరుతో మూసేస్తున్న ప్రభుత్వం.. బార్లను మాత్రం బార్లా తెరుస్తోందన్నారు.
రాష్ట్రంలోని 1.42 కోట్ల కార్డు దారులందరికీ బియ్యం పంపిణీ చెయ్యాలని డిమాండ్ చేశారు. అప్పుల విషయంలో ప్రభుత్వం సమాధానం పెద్ద బూటకం. ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. అదాన్ డిస్టలరీకి రెండేళ్లలోనే రూ. 2,400 కోట్ల విలువైన ఆర్డర్లు ఏ విధంగా ఇచ్చారు? దీనిపై ఈడీ విచారణ జరగాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
