Site icon NTV Telugu

Chandrababu Naidu: పన్నుల వాతలు.. పథకాలకు కోతలు

Babu

Babu

తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కెక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. అమరావతిని స్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్ముతుంది..? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా.. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తారా..? వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు.. పథకాలకు కోతలు తప్ప ఏం లేదన్నారు.

అమ్మఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులను తగ్గించారు.ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసుని 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం దారుణం.నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనం.డబ్బులు పంచినా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పెరగలేదు.డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా వైసీపీకి ఓట్లు పెరగలేదు.గత ఎన్నికలకు, ఉప ఎన్నికలకు చూస్తే కనీసం వైసీపీకి 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదన్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయి. పంటల బీమా సాయంలో అసలైన రైతులకు లబ్ధి జరగడం లేదు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళితుడైన నారాయణ పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగానే ప్రాణాలు కోల్పోయాడన్నారు చంద్రబాబునాయుడు.

Dog Missing: మా కుక్క కనిపించడంలేదు.. వెతికి పెట్టండి

Exit mobile version