NTV Telugu Site icon

Chandrababu Naidu: సీఎం జగన్ రాజకీయాలకు అనర్హుడు

Cbn

Cbn

మహానాడు విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఒంగోలులో మహానాడు విజయం ప్రజావిజయం అని అన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందిన నేతలతో అన్నారు. మహానాడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సీఎం జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు.  ఇకపై విరామం వద్దని మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నెలకు రెండు జిల్లాలలో పర్యటనలు చేయాలని నిర్ణయించారు.

కార్యకర్తలు, అభిమానులు, ప్రజల భాగస్వామ్యంతో ఈస్థాయి విజయం సాధ్యమైందని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందని చంద్రబాబు వెల్లడించారు. క్విట్ జగన్- సేవ్ అంధ్ర ప్రదేశ్ నినాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. మహానాడు విజయవంతంలో భాగస్వాములైన నేతలకు అభినందనలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా నేతల పనితీరుకు చంద్రబాబు అద్భుతం అని కొనియాడారు.  మహానాడు సక్సెస్ ను పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన రెండేళ్ల ముందే కనిపించిందని అన్నారు.

ఇదిలా ఉంటే కుప్పంలో మైనింగ్ మాఫియాపై ఏపీ సీఎస్ కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కుప్పంలో అక్రమ మైనింగ్ యధేచ్చగా జరుగుతోందని, ఇవాళ కూడా నియోజకవర్గంలోని గుడు పల్లెలో అక్రమoగా గ్రానైట్ తరలిస్తున్న 10 లారీలను అధికారులు సీజ్ చేయడం జరిగిందని గుర్తుచేసిన చంద్రబాబు నాయుడు. ఇదే విషయాన్ని గతంలోనూ అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువచ్చానని ఆయన లేఖలో పేర్కొన్నారు.  వైసీపీ నేతల కనుసన్నల్లోనే కుప్పం తో పాటు రాష్ట్రమంతటా అక్రమ మైనింగ్ రవాణా సాగుతూ ఉందని, దీనిపై మరింత నిఘా పెంచి స్మగ్లింగ్ అరికట్టాలని ఆయన కోరారు.