Site icon NTV Telugu

మరికాసేపట్లో కుప్పంకు చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్లలో జోష్‌!

చిత్తూరు : మరికాసేపట్లోనే కుప్పం పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సొంత నియోజక వర్గం లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు చంద్రబాబు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం చేరుకోనున్న చంద్రబాబు నాయుడు…. రెండు గంటలకు బస్టాండ్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం వరకు కుప్పం అంతటా రోడ్ షో లు, నాయకుల ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేయనున్నారు.

కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అయిన కుప్పం మునిసిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ రెండు రోజుల పర్యటన చేపట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలో అధినేత చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version