Site icon NTV Telugu

TDP: మూడేళ్లలో ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీల పెంపు.. దశలవారీ పోరాటం..

విద్యుత్‌ చార్జీలను పెంచుతూ ఏపీ ఈఆర్సీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. ఏడు దశల్లో ప్రజలపై రూ.12వేల కోట్ల భారం మోపారని విమర్శించారు.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చేపట్టే పోరాటానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు చంద్రబాబు.

Read Also: Toll Tax: ఏపీలో భారీగా పెరగనున్న టోల్ ట్యాక్స్..

ఇక, తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఉండేవారిమని తెలిపారు చంద్రబాబు నాయుడు.. సీఎం వైఎస్‌ జగన్‌ అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆరోపించిన ఆయన.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.25 వేల కోట్లకు పైగా అప్పు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి..? అని డిమాండ్‌ చేశారు.. వ్యవసాయ మోటార్ల మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.. మరోవైపు విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఫైర్‌ అయిన వామపక్ష పార్టీలు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి… పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు వామపక్షాల నేతలు.

Exit mobile version