Site icon NTV Telugu

ఓటీఎస్‌ పేదల మెడకు ఉరితాడుగా మారుతోంది :చంద్ర‌బాబు

వైసీపీ స‌ర్కార్ పై చంద్ర‌బాబు మ‌రోసారి మండిప‌డ్డారు. ఓటీఎస్‌ పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని పేర్కొన్నారు. ఇళ్లకు సీఎం భూమి ఇచ్చారా? రుణం ఇచ్చారా?.. ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటి? అని చంద్రబాబు నిల‌దీశారు. కంపల్సరీ కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని… బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు చేస్తోంటే కేసులు పెడతారా..? అని నిల‌దీశారు.

ఛీటింగ్ కేసులు.. 420 కేసులు ఈ ప్రభుత్వం మీద పెట్టాలని డిమాండ్ చేశారు. ఇళ్ల మీదున్న రుణాన్ని మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలోనే జగ‌న్ చెప్పార‌న్నారు. ఇచ్చిన మాటను తప్పారు.. మడమ తిప్పారని జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. ఇప్పటికే జగన్ బయట తిరగలేక పోతున్నారని… వైద్యానికి దాచుకున్న సొమ్మును ఓటీఎస్ కోసం వసూలు చేసేస్తారా..? అని నిల‌దీశారు.

బొబ్బిలిలోని ఓటీఎస్ బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది.. ఆ బాలుడికి వైద్య ఖర్చులు టీడీపీ భరిస్తుందని హామీ ఇచ్చారు. పులిచింతల ప్రాజెక్టు కోసం భూములిచ్చి పునరావాసంలో భాగంగా ఇళ్లు తీసుకున్న పేదల నుంచి ఓటీఎస్ అమలు చేస్తారా..? అని నిల‌దీశారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా ఇల్లీగల్ అని.. రిజిస్ట్రేషన్లను సబ్ రిజిస్ట్రార్లే చేయాలన్నారు. ఎవరు పడితే వాళ్లు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తెలిపారు. ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ డాక్యుమెంట్లను వైసీపీ రంగుల్లో ఇస్తారా..? అని నిల‌దీశారు చంద్ర‌బాబు.

Exit mobile version