Chandrababu Kuppam Tour: కుప్పానికి నీళ్లివ్వని ముఖ్యమంత్రి జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మూడో రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్ కాలనీలో ఆయన పర్యటించారు. కుప్పంలో జరుగుతున్న అరాచకానికి పోలీసులు సహకరిస్తున్నారన్న ఆయన.. మఫ్టిలో ఉండి తెదేపా కార్యకర్తలను కర్రలతో కొట్టారని ఆరోపించారు. మమ్మల్నే కొట్టి మళ్లీ మా పైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులను వెంటనే కొట్టేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తప్పుడు పనులు చేస్తున్న కొంతమంది పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామన్నారు. న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.
AP CM YS Jaganmohan Reddy: సీబీఐ కోర్టులో సీఎం జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు
కుప్పంలో పేదవాడి పొట్టనింపే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారని ఆయన మండిపడ్డారు. దాని నిర్వాహకుడిపై కూడా దాడి చేశారన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ ఉంటే దాన్ని ఇప్పటికీ సీఎం స్టాలిన్ కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. వైసీపీకి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే వైసీపీ నేతల పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా వైసీపీకి కొమ్ము కాయడం హేయమన్నారు. హంద్రీనీవా పనులను ఈ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
