Site icon NTV Telugu

Chandra Babu: నేను కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరు

Chandra Babu

Chandra Babu

కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మండిపడ్డారు. తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను కన్నెర్ర చేస్తే సీఎం జగన్‌ తట్టుకోలేరని హెచ్చరించారు. జగన్‌ పాలనలో ప్రజలకు వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు తప్పడం లేదని ఎద్దేవా చేశారు.

Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలి

కర్నూలులో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించి వైసీపీ జెండాలు పెట్టడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని.. తమ పార్టీని ఏం చేయలేరని కార్యకర్తలకు భరోసా కల్పించారు. .మహానాడు నుంచి దృష్టి మళ్లించేందుకు వైసీపీ బస్సు యాత్ర ప్లాన్ చేసిందన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై త్వరలో ఒంగోలులో జరిగే మహానాడులో చర్చించుకుందామని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వంపై పోరాడే ప్రతి కార్యకర్త వీరుడేనని తెలిపారు. జగన్ విధానాలతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. నదుల అనుసంధానం, పోలవరంతో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని కలలు కన్నామని.. కానీ ఆ కలల్ని జగన్ చిదిమేశారని విమర్శించారు.

Exit mobile version