Site icon NTV Telugu

Chaganti KoteswarRao: గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని జగన్ కి ప్రశంసలు

Chaga2

Chaga2

తెలుగు రాష్ట్రాల్లో చాగంటి కోటేశ్వరరావు పేరు వినని వారుండరు. ఆధ్యాత్మిక ప్రసంగాలతో సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు. ఏ టీవీలో చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఆయన అందరికీ చిరపరిచితం. ఉదయాన్నే ఆయన అందరినీ నిద్రలేపేస్తుంటారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే.

 

Read Also: BJP AndhraPradesh: కన్నా రాజీనామాపై బీజేపీ స్పందన ఎలా ఉందంటే?

చాగంటిని ఘనంగా సత్కరించి వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, ఎండీ డాక్టర్‌ కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించిన చాగంటి కోటేశ్వరరావు, కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి. గోశాలను ఆసాంతం పరిశీలించారు చాగంటి కోటేశ్వరరావు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు చాగంటి కోటేశ్వరరావు.

Read Also: Bollywood: సూపర్ మాన్ Vs బాట్ మాన్; ఐరన్ మాన్ Vs కెప్టెన్ అమెరిక; టైగర్ Vs పఠాన్

Exit mobile version