Site icon NTV Telugu

National Clean Air Programme: ఏపీ నుంచి మరో 11 పట్టణాలు ఎంపిక చేసిన కేంద్రం..

Ncap

Ncap

National Clean Air Programme: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గాలి నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని పట్ణాలను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.. విజయవాడ, విశాఖపట్నంతోపాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు పర్యవరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారు. రాజ్యసభలో ఇవాళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన అశ్వినీకుమార్‌ చౌబే.. 15వ ఆర్థిక సంఘం నివేదికి ప్రకారం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నంకు అదనంగా మరో 11 పట్టణాలను గుర్తించినట్లు తెలిపారు. కేంద్రం తాజాగా ఎంపిక చేసిన పట్టణాల్లో శ్రీకాకుళం, చిత్తూరు, ఒంగోలు, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, అనంతపురం, కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు ఉన్నట్లు వెల్లడించారు.. జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమంలో భాగంగా.. ఆయా పట్టణాల్లో గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.. విశాఖపట్నం, విజయవాడ నగరాలలో గాలి నాణ్యతను మెరుగు పరిచేందుకు పనితీరు ఆధారిత గ్రాంట్‌ను ఇస్తూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్న ఆయన.. ఈ గ్రాంట్‌ కింద విజయవాడకు 2022-23లో 163 కోట్ల రూపాయాలు కేటాయించగా, 2021-22లో 100.35 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 2022-23 సంవత్సరం వరకు విశాఖ నగరానికి 148 కోట్లు కేటాయించగా, 2021-22 వరకు 100.75 కోట్లు విడుదల చేసినట్లు రాజ్యసభలో వెల్లడించారు పర్యవరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే.

Read Also: Nara Lokesh: బిగ్ బ్రేకింగ్.. కెజిఎఫ్ హీరో యష్ తో నారా లోకేష్ భేటీ

Exit mobile version