NTV Telugu Site icon

Train Birthday: రైలుకీ ఒక రోజు వచ్చింది. పుట్టిన రోజు. హ్యాపీ బర్త్‌ డే పినాకిని

Trains

Trains

నిజంగా ఇది వెరైటీ న్యూసే. ఆసక్తి కలిగించే వార్త కూడా. మనుషులకు ఘనంగా, సంతోషంగా ఏటా పుట్టిన రోజులు చేసుకోవటం సహజం. ఈమధ్య జంతువులకు కూడా అడపా దడపా నిర్వహిస్తున్నారు. జీవంతో ఉన్నవాటికి జన్మదినోత్సవాన్ని జరిపితే పెద్దగా చెప్పుకోవాల్సి పనిలేదు గానీ ఇవాళ ఒక ప్రాణంలేని భారీ యంత్రానికి (రైలుకి) సైతం బర్త్‌ డే సెలబ్రేషన్‌ జరగటం విశేషం. ఈ అరుదైన వేడుకలకి విజయవాడ రైల్వే జంక్షన్‌ వేదిక కావటం గమనార్హం. పినాకిని ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకి 30 ఏళ్లు నిండిన సందర్భంగా ఈరోజు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే విజయవాడ డివిజన్‌ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ-చెన్నై మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్‌ ఫాస్ట్‌ రైలు నేటితో మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది.

Viral News: అతనికి 61.. ఆమెకి 18.. ఆయనే బెస్ట్ అంటూ కితాబు

దీంతో అధికారులు, ఉద్యోగులు, అభిమానులు ఈ వండర్‌ఫుల్‌ ఈవెంట్‌ నిర్వహించారు. రైలింజన్‌ని పూల దండలతో అలంకరించి, కేట్‌ కట్‌ చేసి ఒకరినొకరు తినిపించుకొని ఎంజాయ్‌ చేశారు. పినాకిని వద్దకు చేరి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రోగ్రామ్‌ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పినాకిని సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 1992 జూలై 1న పరుగు ప్రారంభించింది. రోజూ 431 కిలోమీటర్లు వెళ్లి, తిరిగొస్తుంది. ఒక వైపు ప్రయాణానికి 7 గంటల సమయం పడుతుంది. ఈ ట్రైన్‌ మెయింటనెన్స్‌ను విజయవాడ డివిజనే చూసుకుంటోంది. ఘనత వహించిన భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి ఒక వేడుక జరగటం గతంలో ఎప్పుడూ చూడలేదు.. వినలేదు అని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?