వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ మరోసారి వేగం పెంచింది..విచారణలో భాగంగా పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వివేకా సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు…గతంలో సీబీఐ బృందంలో పలువురికి కరోనా సోకడంతో మధ్యలో విచారణకు బ్రేక్ పడింది..అంతేగాకుండా వివేకా కూతురు సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసిన అనంతరం కేసులో మరింత వేగం పెంచారు..సీబీఐ విచారణలో భాగంగా పులివెందులకు చెందిన పలువురు కీలక వ్యక్తులను విచారణ చేసి హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు..
పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం ఆర్ అండ్ బి గెస్ట్ లో మకాం వేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.. దర్యాప్తులో భాగంగా వివేకా ఇంటి సమీపంలో ఉన్న పాల డైరీ వ్యాపారులతో పాటు ఓ సెల్ పాయింట్ నిర్వాహకుడిని కూడా సీబీఐ బృందం ప్రత్యేకంగా విచారణ చేసింది..హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్ రెడ్డి కి చెందిన సెల్ ఫోన్ రిపేర్ నిమిత్తం సెల్ పాయింట్ లో గతంలో ఇచ్చాడని అందుకు కారణంగానే సెల్ పాయింట్ నిర్వాహకుడిని విచారణ చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం సీబీఐ బృందం వైఎస్ వివేకాకు అత్యంత సన్నిహిత వ్యక్తి అయిన ఎర్ర గంగిరెడ్డి ని కూడా విచారణకు పిలిపించి సుమారు రెండు గంటలకు పైగా విచారణ చేశారు..విచారణలో భాగంగా హత్య జరిగిన తీరుతో పాటు అనుమానిత వ్యక్తుల సమాచారం గురించి ఆరా తీసి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం… అంతేకాకుండా ఈ ముగ్గురు వ్యక్తుల విచారణ అనంతరం వివేకా ఇల్లు,,హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు….త్వరగా కేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సీబీఐ బృందం వేగవంతం చేస్తూ ముందుకు వెళ్తోంది..ఇక మొదటి రోజు విచారణ తర్వాత కూడా వైఎస్ కుటుంబానికి చెందిన ముఖ్య నేతలు మరియు కుటుంబ సభ్యులను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది..
గతంలో సీబీఐ విచారణకు హాజరైన వారిని సైతం మరోసారి విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని సమాచారం… ఇలా ఇక చివరి సారి అంటే సీబీఐ విచారణలో త్వరితగతిన కేసులో దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే తెలుస్తోంది…ఇటు వివేకా హత్య కేసు రాజకీయంగా పలు విమర్శలకు తోడవ్వడంతో పాటు వివేకా కుమార్తె సునీత ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కేసు వేగవంతం చేయాలని కోరడం చూస్తుంటే త్వరలోనే సీబీఐ బృందం దోషులను నిర్ధారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.