NTV Telugu Site icon

ఏపీలో 40 చోట్ల సీబీఐ సోదాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సీబీఐ సోదాలు క‌ల‌క‌లం సృష్టించాయి.. ఏపీలోని ప్రావిడెంట్‌ ఫండ్‌ కార్యాలయాల్లో ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హించారు సీబీఐ అధికారులు.. ఏకంగా రాష్ట్రంలో 40 చోట్ల త‌నిఖీలు నిర్వ‌హించారు.. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నార‌న్న ఫిర్యాదులు అంద‌డం.. ప్రావిడెంట్‌ ఫండ్‌ క్లియరెన్స్‌ కోసం ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్న‌ట్టుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో.. సీబీఐ రంగంలోకి దిగింది.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పేల ద్వారా ఉద్యోగులు డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.. గుంటూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, గుంతపల్లిలో సోదాలు నిర్వ‌హించిన సీబీఐ అధికారులు.. ప్రావిడెంట్‌ ఫండ్‌లో జరిగిన అక్రమాలపై 4 కేసులు న‌మోదు చేశారు.. ప్రావిడెంట్ ఫండ్ కార్యాల‌యాల‌తో పాటు.. పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలోనూ ఏక‌కాలంలో సీబీఐ సోదాలు నిర్వ‌హించింది.

Read Also: సీఎంకు గ‌వ‌ర్న‌ర్ స‌వాల్.. నేనే రంగంలోకి దిగుతా..!