ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు గంజాయి, మరోవైపు అక్రమ మద్యం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కర్నూలు జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మకరం చేశారు. అక్రమ రవాణా పై కర్నూలు స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు.
కర్నూలు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పంచలింగాల వద్ద సెబ్ తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక బ్యాగ్‌లో 75 లక్షల రూపాయలు నగదు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి నగదు, కారును సీజ్ చేశారు. ఈ నగదును హైదరాబాద్ నుండి బీదర్ కి తరలిస్తున్నట్లు సెబ్ సీఐ మంజుల తెలిపారు. కేసు నమోదు చేసుకుని కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు సీఐ తెలిపారు.