NTV Telugu Site icon

కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి త‌ల‌కు గాయం… కార‌ణం…

నిన్న‌టి రోజున తిరుప‌తిలో జ‌న ఆశీర్వాదస‌భ‌కు హాజ‌రైన కిష‌న్ రెడ్డి ఆ స‌భ త‌రువాత ఈరోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.  అనంత‌రం ఈరోజు మ‌ధ్యాహ్నం కిష‌న్ రెడ్డి విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సంద‌ర్శించారు.  కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి, ఆల‌య అధికారులు స్వాగ‌తం ప‌లికారు.  ద‌ర్శ‌నం చేసుకొని కారు ఎక్కుతుండ‌గా కారు డోర్ త‌గ‌ల‌డంతో ఆయ‌న త‌ల‌కు స్వ‌ల్ప‌గాయం అయింది. స్వ‌ల్ప‌మైన గాయ‌మేన‌ని, ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు.  రేపు వ‌రంగ‌ల్ జిల్లాలో జ‌న ఆశీర్వాద యాత్ర‌ను చేప‌ట్ట‌బోతున్నారు.  ఉద‌యం 8:30 గంట‌ల‌కు నూత‌న్‌గ‌ల్ నుంచి జ‌న ఆశీర్వాద యాత్ర ప్రారంభం అవుతుంది.  రాత్రి 8:30 గంట‌ల‌కు యాదాద్రిలో యాత్ర ముగుస్తుంది.  

Read: గంగూలీతో కలిసి క్రికెట్ అడిన ఆ ఆటగాడు… ఇప్పుడు రోడ్డు పక్కన‌…