తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ కె ఫాస్ట్ పుడ్ వద్ద అదుపు తప్పిందో కారు. పార్క్ చేసిన బైక్ లపై దూసుకెళ్ళింది కారు. ఈ ప్రమాదంతో ఎనిమిది బైక్ లు ధ్వంసం అయ్యాయి. కారు టైర్ పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. నిత్యం రద్దీగా వుండే రహదారిపై కారు బీభత్సంతో పరుగులు తీశారు పాదచారులు. ప్రమాదం కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చి కారుని అక్కడినించి తొలగించారు.
తిరుపతిలో అదుపు తప్పిన కారు.. బైక్ లు ధ్వంసం
