Site icon NTV Telugu

రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు !

అమరావతి రాజధాని భూముల కుంభకోణంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఐఏఎస్ సాంబశివరావు, ఐఏఎస్సులు కాంతిలాల్ దండే, కోన శశిధర్లూ అక్రమాలకు సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంతిలాల్ దండే, కోన శశిధర్ సీఐడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రికార్డులను ట్యాంపర్ చేశారని.. తుళ్లూరు మండలంలో అసైన్డ్ రికార్డులను మాయం చేశారని అధికారులపై అభియోగాలు ఉన్నాయి.

read also : రూ.879 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

ఇప్పటికే సీఐడీకి సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సాక్షిగా మారారు. తన వద్దనున్న మరిన్ని ఆధారాలను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సీఐడీకి సమర్పిస్తానని చెబుతున్నారు. నాడు తప్పిదాలకు పాల్పడిన అధికారుల నుంచే సమాచారం రాబట్టే వ్యూహంతో వెళ్తోన్న సీఐడీ… చంద్రబాబు, నారాయణ, పుల్లారావు చేసిన అక్రమాలకు పక్కా సాక్ష్యాలు దొరికి తీరతాయని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

Exit mobile version