Site icon NTV Telugu

Student Excursion: ఏపీలో తెలంగాణ విద్యార్థినుల బస్సు బోల్తా.. 12 మందికి తీవ్ర గాయాలు

Khammam Crime

Khammam Crime

Student Excursion: ఏపీలో తెలంగాణ విద్యార్థుల బస్సు బోల్తా పడింది. దీంతో ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ విద్యార్థుల విహారయాత్ర తీరని విషాదాన్ని నింపింది. ఆనందంగా వెళుతున్న విహారయాత్రలో జరిగిన ప్రమాదం కుటుంబాల్లో బాధను మిగిల్చింది. విహారయాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని కడియంకు విహారయాత్రకు వెళ్లి వస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థుల బస్సుబోల్తా పడటంతో.. ఈఘటన జరిగింది.

Read also: RRRforOscars: జక్కన్న ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా?

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లోని కడియంకు విహారయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు బోల్తా పడింది. బస్సులో 40 మంది డిగ్రీ చదువుతున్న విద్యార్థినిలు ఉండగా వారిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలోని ప్రైవేటు కళాశాలకు సంబంధించిన విద్యార్థినులు విజ్ఞాన టూర్ కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని కడియం కి వెళ్లి వస్తున్నారు. ఇది ప్రైవేటు బస్సు కావడంతో ప్రధానమైన రహదారి మీదునుంచి కాకుండా మరో రహదారి నుంచి సత్తుపల్లి కి సమీపంలోకి వస్తుండగా అశ్వరావుపేట మండలం పాపిడి గూడెం వద్ద బోల్తా పడింది. ఈ ఘటన లో 12 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వారందరినీ అశ్వరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. విద్యార్థినిలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
RRRforOscars: జక్కన్న ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా?

Exit mobile version