తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లింగంపేట వాంబే గృహాల్లో దారుణం జరిగింది. ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని బత్తిన నగర్ కు చెందిన మువ్వల దుర్గా ప్రసాద్ గా గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా భావిస్తున్నారు.
దుర్గా ప్రసాద్ ను కత్తితో నరికి చంపి పరారయ్యారు దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు త్రీటౌన్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు త్రీటౌన్ పోలీసులు