Botsa Satyanarayana Counter To Minister Harish Rao: ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాట్ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేగింది. ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తాత్కాలికంగా వెనక్కు తగ్గడానికి కారణం తామేనని తెలంగాణ మంత్రులు చెప్తుండగా.. అందుకు ఏపీ మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దెబ్బతో కేంద్రం కిందకు దిగొచ్చిందని అనడం ఏంటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తమ వైసీపీ ప్రభుత్వం ముందు నుంచే వ్యతిరేకిస్తూ వస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారని, ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి కూడా చేశారని గుర్తు చేశారు. అందుకే కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లలేదన్నారు. ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం పూర్తిగా విరమించుకుందనే అంశం కూడా కరెక్ట్ కాదన్నారు.
GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
అసలు ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడటానికి హరీశ్ రావు ఎవరు? అతనికేంటి సంబంధం? అని బొత్స ప్రశ్నించారు. ఎవరో ఏదో మాట్లాడితే, దానికి తామెందుకు సమాధానం చెప్పాలన్నారు. బాధ్యతల గల వ్యక్తులు.. బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. వాళ్లు తమ రాష్ట్రం గురించి పట్టించుకుంటే చాలని, చరిత్రలన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు తెలంగాణలో ఉండాలనుకుంటున్నారో, తెలంగాణ ప్రజలు అమెరికాలో ఉండాలని కోరుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారో హరీష్ రావునే అడగండన్నారు. కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసమే ఏదో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అసలు బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టిందని ప్రశ్నించారు. మధ్యలో వచ్చి, మా వల్లే ఆగిందని హరీష్ రావు అంటుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. పరిపక్వత ఉన్న నాయకుల మాటలు ఇలా ఉండవన్నారు. కేంద్రాన్ని బీఆర్ఎస్ ఏం నిలదీసిందని అడిగిన బొత్స.. ఏపీలో జరుగుతున్న సంక్షేమం తెలంగాణలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సింగరేణికి, స్టీల్ ప్లాంట్‌కు పోలిక ఎక్కడ? అని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని తమకు తెలుసని, ఒకవేళ జరిగితే ఎలా ఆపుకోవాలో కూడా తెలుసని అన్నారు.
Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!
ఇదే సమయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు తన శేష జీవితాన్ని ప్రజల కోసం కాదు.. తన కుటుంబం కోసం అంకితం చేసి ఉంటాడన్నారు. పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని మేం లూటీ చేశామనటం కరెక్టా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబు హయాంలో ఈయన రాష్ట్రానికి పట్టిన శని అన్నది వాస్తవం కాదా? అని అడిగారు. ఇక ఇదే సమయంలో.. మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని బొత్స ఖండించారు. సీదిరి చేసిన వ్యాఖ్యలను తాను వినలేదని, తను అలా మాట్లాడి ఉంటాడని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఒకవేళ అలా మాట్లాడి ఉంటే.. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. కాగా.. మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మంత్రి సీదిరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌లాగా హరీష్ రావు ఫాంహౌస్‌లో కూర్చుని కల్లుతాగిన కోతిలా మాట్లాడుతున్నాడని, మా దగ్గర లిక్కర్ స్కాంలు వంటివి లేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాటిని మంత్రి బొత్స ఖండించారు.