Site icon NTV Telugu

సంస్కృతి, సంప్రదాయాలు తెలియని వ్యక్తి : అశోక్ గజపతిపై బొత్స ఫైర్‌

అశోక్ గజపతి రాజుపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అశోక్ గజపతి రాజు లాంటి పెద్ద వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరికాదని… కనీస సంస్కృతి, సంప్రదాయాలు తెలియని వ్యక్తిలా ఆయ‌న వ్యవ‌హ‌రించార‌ని నిప్పులు చెరిగారు. ఇదేనా ఆయన పెంపకం…వారి తల్లిదండ్రులు ఇదే నేర్పించారా?? అని నిల‌దీశారు.

https://ntvtelugu.com/vellampalli-counter-to-ashok-gajapathiraju/

జిల్లాలో ఏనాడు ఇలాంటినీచమైన సాంప్రదాయాలు జరగలేదని.. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఏ రోజు ఒక లెటర్ కూడా రాయలేదని మండిప‌డ్డారు. ఏ రోజు తన విలువులు కాపాడు కోలేదని చుర‌క‌లు అంటించారు.

మనం ఎవరం కూడా రాచరిక వ్యస్థలో లేమని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్నారు. ఆలయ శంకుస్థాపనకు పిలవడానికి వెళ్లిన ఈఓని, ప్రధాన అర్చకలను తిట్టారని.. ప్రతిదీ ప్రజలు చూస్తున్నారని వెల్ల‌డించారు. రామతీర్ధ ఆలయాన్ని వైభవంగా, రెండో భద్రాద్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు బొత్స‌.

Exit mobile version