NTV Telugu Site icon

Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu Announced Movement Against AP Government: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే.. ఉద్యమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు హెచ్చరించారు. కర్నూల్లో ఫిబ్రవరి 5న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఫిబ్రవరి 13న సీఎస్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చామన్నారు. చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులు.. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాల కోసం ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించామన్నారు. కింది స్థాయి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా ప్రభుత్వానికి సహకరించామన్నారు. ఈరోజు సమావేశం ద్వారా కార్యాచరణ ఉంటుందని ముందే చెప్పామని.. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, చులకనగా చూస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారన్నారు. మా సహనం, ఓర్పును చేతకాని తనంగా చూస్తుందని మండిపడ్డారు.

Nokia: 60 ఏళ్లలో మొదటి సారి లోగో మార్పు.. కొత్త వ్యూహమా?

ఛలో విజయవాడ సమయంలో ఉద్యోగులు తమకు అండగా నిలిచారని.. ఏడాది కాలంగా సీఎం ఇచ్చిన హామీనే అమలు‌ చేయలేదని బొప్పరాజు వ్యాఖ్యానించారు. సీఎం ఆర్ధికపరమైన అంశాలు పరిష్కరించలేదని, మంత్రుల బృందంతో మేం చేసిన చర్చలు చాయ్ బిస్కట్ చర్చలు మాత్రమేనని పేర్కొన్నారు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రభుత్వంపై తమకున్న నమ్మకం పూర్తిగా సడలిపోయిందన్నారు. ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు మమ్మల్ని క్షమించవని పిలుపునిచ్చారు. నేడు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గతంలో 11వ పీఆర్సీని కూడా తాము పోగొట్టుకున్నామని.. తమ ఆవేదనను గుర్తించాల్ని, తమను శతృవులుగా చూడకండని కోరారు. ఈ పరిణామాలకు సీఎం బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికీ చాలా సహనంతో ఉన్నాం, ఇక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

MK Stalin: నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు, కమ్యూనిటీ లంచ్‌.. స్టాలిన్‌ బర్త్‌డే ప్లాన్

ఏడాదిగా సమస్యలకు పరిష్కారం చూపనందు‌వల్లే తాము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని బొప్పరాజు స్పష్టం చేశారు. మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వివిధ రూపాలలో ఆందోళనలు, నిరసనలు ఉంటాయన్నారు. ఉద్యమాలు ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేయరన్న ఆయన.. తమ ఆవేదన, ఆక్రోశం ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ఎప్పుడు జీతం ఇస్తారో తెలియట్లేదని, వందలో డెబ్బై రూపాయలు మాత్రమే తమకు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేసే ఆలస్యం వల్ల ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల్లో చులకన భావం వచ్చే పరిస్థితికి ప్రభుత్వం మమ్మల్ని తెచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. 11వ పీఆర్సీ చర్చల సమయంలో ఇచ్చిన హామీని నేటికీ అమలు‌ చేయలేదని, అందుకే ఇప్పుడు ఉద్యమం తప్పదనే కార్యాచరణ ప్రకటించామని చెప్పారు.

ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించిన కార్యాచరణ
మార్చి 9,10 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు.
మార్చి 13,14,15 భోజన విరామ సమయంలో ఆందోళన.
మార్చి 16-20 వరకు అన్ని జిల్లాల్లో ధర్నాలు.
మార్చి 21న సెల్ డౌన్.
మార్చి 24న హెడ్ ఆఫీసుల వద్ద ధర్నా.
మార్చి 27న కరోనాతో‌ చనిపోయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులకు పరామర్శ.
ఏప్రిల్ ఒకటిన సీపీఎస్ ఉద్యోగులు కుటుంబాల పరామర్శ.
ఏప్రిల్ మూడున ఛలో స్పందన
ఏప్రిల్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. రెండో ఫేజ్ కార్యాచరణ ప్రకటన

Show comments