Site icon NTV Telugu

Bonda Uma vs Devineni Avinash: బోండా వర్సెస్‌ దేవినేని.. వంగవీటి రాజకీయం..!

Bonda Uma Vs Devineni Avina

Bonda Uma Vs Devineni Avina

బోండా ఉమా, దేవినేని అవినాష్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రంగా చనిపోయిన సమయంలో దేవినేని నెహ్రూ దగ్గరే ఉన్నాడన్నారు బోండా ఉమా. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలో కొడాలి ఉన్నాడని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి ఎవరని ప్రశ్నించారు బోండా ఉమా. అయితే, బోండా ఉమా ఓ చిల్లర వ్యక్తని, బజారు మనిషని మండిపడ్డారు దేవినేని అవినాష్. బోండా ఉమా కుటుంబంపై చెప్పాలంటే చాలానే ఉందన్నారాయన. బైక్, కారు రేస్‌లు, రేవ్ పార్టీ కల్చర్ సిటీకి తీసుకొచ్చిన వ్యక్తి బొండా, ఆయన కొడుకులేనని విమర్శించారు దేవినేని అవినాష్‌. తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమా అని మండిపడ్డారు.

Read Also: Off The Record about Anam Ramanarayana Reddy: ఆనం అసంతృప్తి ఎవరి మీద? తప్పుకోవడానికే అలా మాట్లాడుతున్నారా?

తెలుగుదేశం హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తే.. వైసీపీ ప్రభుత్వంలో ఒక పరిశ్రమ కూడా రాకుండా పోయింది. వైసీపీ సర్కార్ యువతను పూర్తిగా నిర్వీర్యం చేసింది. కందుకూరు ఘటన కొంత మంది రాజకీయం చేస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రులు రాబందుల్లా శవాల మీద కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు బోండా ఉమామహేశ్వరరావు.. ఇక, వంగవీటి రంగా చనిపోయిన సమయంలో దేవినేని నెహ్రూ వద్దనే ఉన్నాడు.. రంగా హత్య జరిగినపుడు కొడాలి నాని నెహ్రూ దొడ్డిలో ఉన్నాడు అని వ్యాఖ్యానించిన బోండా ఉమ.. రంగా వర్ధంతి ఎవరు.. ఏ సామాజిక వర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవడు? అని మండిపడ్డారు.. విజయవాడలో వ్యభిచార గృహాలు, మసాజ్ పార్లర్లు, సెటిల్ మెంట్, దందాలు చేస్తోందా మీ అవినాష్ కాదా? అని నిలదీశారు.. అవినాష్‌ను ప్రోత్సహిస్తోంది సీఎం జగన్ కాదా? ఆనాడు రాజశేఖర్ రెడ్డి దేవినేని నెహ్రూను ప్రోత్సహిస్తే.. ఇవాళ అవినాషుని జగన్ ప్రోత్సహిస్తున్నాడు అని విమర్శించారు.

ఇక, బోండా ఉమ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు దేవినేని అవినాష్.. కందుకూరులో 8 మరణాన్ని పక్క దోవ పట్టించే ప్రయత్నం టీడీపీ చేస్తోందన్న ఆయన.. కందుకూరు ఘటనను జగనుకు ముడిపెడుతున్న చంద్రబాబుకి సిగ్గుందా..? అని మండిపడ్డారు.. గతంలో గోదావరి పుష్కరాలు, ఇపుడు కందుకూరులో ప్రచారం కోసం చేసిన పని వల్ల అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు.. బోండా ఉమా ఒక చిల్లర వ్యక్తి, బజారు మనిషి.. బోండా ఉమా కుటుంబం గురించి, పెంపకం చెప్పాలంటే చాలా ఉందన్నారు. తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమ అని విమర్శించారు.. కోగంటి సత్యం, ఐలాపురం వెంకయ్య దగ్గర డ్రైవర్‌గా పని చేసి కాళ్ళు నొక్కి చివరికి వారినే మోసం చేసిన వాడు బోండా ఉమా అని మండిపడ్డారు.. గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే బోండా ఆగడాలపై విచారణ చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్‌నించారు. చంద్రబాబు కాళ్ళు పట్టుకుని బయట పడ్డాడు బోండా… బైక్ రేసులు, కారు రేసులు, రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చింది బోండా ఉమా, ఆయన కుమారులు అని ఆరోపించారు.. బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా.. ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టే సీఎం వైఎస్‌ జగన్‌ నుంచి నాకు ప్రోత్సాహం లభించిందన్నారు.. 30 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలో ఇంకా చనిపోయిన దేవినేని నెహ్రును టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కోర్టు కేసు కూడా కొట్టేసిన విషయం తెలుసుకోవాలని హితవుపలికారు.. ఇకపై నెహ్రు పేరు ఈ విషయంలో ప్రస్తావిస్తే లీగల్‌గా ముందుకు వెళ్తాం అని హెచ్చరించారు దేవినేని అవినాష్‌.

Exit mobile version