Site icon NTV Telugu

నారాయణస్వామి, ప్రకాష్‌రెడ్డిల వ్యాఖ్యలు అర్ధరహితం: విష్ణు వర్ధన్‌ రెడ్డి

డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నేత విష్ణు వర్ధన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. సీఎంను హత్య చేస్తారని వైసీపీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదన్నారు.

Also read: రేణిగుంటలో అమరావతి రైతులకు ఘన స్వాగతం…

సీఎం ను కాపాడుకోలేని వాళ్లు ప్రజలను ఎలా కాపాడుతారని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని డిప్యూటీ సీఎం అంగీకరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతలు లేవనుకుంటే హోం మంత్రి చేత రాజీనామా చేయించండి లేదా భర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

Exit mobile version