NTV Telugu Site icon

ఏపీలో బిగ్ వ్యాక్సిన్ డే.. ఒకేరోజు 8 ల‌క్ష‌ల వ్యాక్సిన్ల‌కు ప్లాన్

vaccines

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్.. దీంతో.. అన్ని దేశాలు క్ర‌మంగా వ్యాక్సిన్‌పై దృష్టిసారిస్తున్నాయి.. ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం బిగ్ వ్యాక్సిన్ డే నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతోంది.. రేపు ఏపిలో బిగ్ వ్యాక్సిన్ డే నిర్వ‌హించ‌నున్నారు.. ఒకేరోజు 8 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధ‌మ‌వుతున్నాయి.. దీనిలో భాగంగా జిల్లాలకు టార్గెట్ ఫిక్స్ చేశారు వైద్యారోగ్య శాఖ అధికారులు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రోజే 6 ల‌క్ష‌ల వ్యాక్సిన్లు వేసి చ‌రిత్ర సృష్టించిన ఏపీ ప్ర‌భుత్వం… ఇప్ప‌టి వ‌రకు రాష్ట్రవ్యాప్తంగా కోటి 22 ల‌క్ష‌ల 83 వేల 479 డోసులు వేసింది.. అందులో 26 ల‌క్ష‌ల 41 వేల 739 మందికి రెండు డేసులు పూర్తి కాగా.. 70 ల‌క్ష‌ల మందికి ఒక్క డోసు వేశారు..