NTV Telugu Site icon

బెజవాడ బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్.. ట్రయల్ రన్

విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. బెంజ్‌ సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌పై ట్రైన్‌ రన్‌ ప్రారంభించారు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు. బెంజ్‌ సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ పైకి వాహనాలకు అనుమతిచ్చారు. ఈ నెల 14వ తేదీన ఫ్లైఓవర్‌ను లాంఛనంగా వర్చువల్‌ పద్దతిన ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ఏడాదిలోపే అందుబాటులోకి వచ్చింది బెంజ్‌ సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌.2020 లో లక్ష్మీ ఇన్ ఫ్రా సంస్థ పనులు ప్రారంభించింది. నిర్ణీత గడువుకు 6 నెలల ముందే పనులు పూర్తి చేసి నేటి నుంచి రాక పోకలు ప్రారంభించారు.

రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో బెంజ్‌ సర్కిల్‌లో తొలగనున్నాయి ట్రాఫిక్‌ కష్టాలు. రూ.90 కోట్లతో 1.4 కిలోమీటర్లు మేర బెంజ్‌ సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగింది. 224 భూగర్బ పిల్లర్లు, 56 పిల్లర్లు, 56 స్పాన్స్‌, 56 స్లాబులు, 220 గడ్డర్లతో రూపుదిద్దుకుంది ఫ్లైఓవర్‌. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో పనులు వేగవంతంగా జరిగాయి. నిత్యంరద్దీగా వుండే ఈ ప్రాంతంలో రెండో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.