కాదేదీ కబ్జాకు అనర్హం అని భావించారో ఏమో.. అనంతపురం జిల్లాలో భూబకాసురులు రెచ్చిపోయారు. ఎవరి స్థలాలను వారు వదలడం లేదు. అనంతపురం జిల్లా యాడికి పట్టణంలో వెంగమ నాయుడు కాలనీ పక్కన ఉన్న 3 ఎకరాల్లో బిచ్చగాళ్ల స్థలాన్ని కబ్జా చేశారు ఓ పార్టీ నాయకులు. కబ్జా చేసిన మా స్థలాన్ని ఇప్పించండి అంటూ యాడికి తాహసిల్దార్ , ఎస్ఐ వద్ద మొరపెట్టుకున్నారు భిక్షగాళ్ళు. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని 451 సర్వే నెంబర్లు ఉన్న వెంగమ నాయుడు కాలనీ పక్కలో ఉన్న భూమిని గుత్తి మండలం బాసు పల్లె గ్రామానికి చెందిన భిక్షగాళ్ళు,బుడగ జంగాలకు చెందిన 30 కుటుంబాలు కలిసి 2007 సంవత్సరంలో 449 సర్వే నెంబర్లు లో 3 ఎకరాల భూమిని యాడికి గ్రామానికి చెందిన మౌలాలి, బండారు రాఘవ వద్ద కొనుగోలు చేశారు.
2021లో సీపీఐ మండల నాయకుడు ఊటకొండ వెంకటేశు. వెంగమ నాయుడు కాలనీకి చెందిన పురుషోత్తమా చారి. ఎల్ అండ్ టి రసూల్ బాషా కలిసి గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన కొంతమంది వ్యక్తులతో ఈ స్థలం కమ్యూనిస్టు పార్టీకి చెందిన 451 సర్వే నెంబర్ లోని భూమి అని కబ్జా చేసి బండలు నాటించారు. వారి వృత్తిరీత్యా బుడగ జంగాల వారు ఇతర జిల్లాలలో ఉండడంతో తమ స్థలం కబ్జా చేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. బుడగ జంగాల వారు వెంటనే వారి స్థలం వద్దకు వచ్చి బండలు నాటిన వారిని తీసివేయమనగా ఇది కమ్యూనిస్టు నాయకుడు వెంకటేశు ఆక్రమించుకొని నిర్మాణాలు చేసుకోమని చెప్పాడని అందుకు తాము ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టామని తెలిపారు.
Read Also: Students Clash for Girl: ఔను.. ఆ అమ్మాయి కోసం వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు
వెంటనే బుడగ జంగాలకు చెందిన భిక్షగాళ్లు కమ్యూనిస్టు నాయకుడు విబి వెంకటేష్ ఇంటి వద్దకు వెళ్లి తమ స్థలంలో ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఆ స్థలం మీది కాదని , అవసరమనుకుంటే మీ స్థలాల్లో కూడా మేము జెండాలు నాటి ఇల్లు నిర్మిస్తామన్నారు. మీ మీద కేసులు కూడా పెడతామంటూ బెదిరించారు. బుడగ జంగాల వారు యాడికి తాహసిల్దార్ , ఎస్సై లకు మేము భిక్షయాటన చేసుకుంటూ వచ్చిన డబ్బుతో భూమిని కొంటే మా భూమిని కమ్యూనిస్టు వాళ్ళు కబ్జా చేశారని తమకు ఇప్పించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు.
Read Also: Anti-Hijab Protests In Iran: అట్టుడుకుతున్న ఇరాన్.. ప్రభుత్వ కాల్పుల్లో 50 మంది మృతి