Site icon NTV Telugu

Bapatla SI Case: కీచక ఎస్సై.. బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళపై అత్యాచారం

Si Harassed Woman

Si Harassed Woman

Bapatla SI Case: తమకు ఏదైనా సమస్య వస్తే, ప్రజలందరూ ముందుగా తట్టేది పోలీస్ స్టేషన్ తలుపులే. కానీ.. ఆ రక్షక భటులే భక్షకులుగా మారితే? అందరూ కాదు కానీ, కొందరు మాత్రం తమ ఒంటిపై ఉన్న ఖాకీ బట్టలను చూసి రెచ్చిపోతున్నారు. అమాయకుల్ని బెదిరిస్తూ.. వారిపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎస్సై బాగోతం కూడా బట్టబయలైంది. బర్త్‌డే పార్టీకి అని పిలిచి.. ఆమె డ్రింక్‌లో మత్తుమందు కలిపి, అత్యాచారం చేశాడో కీచక ఎస్సై. అంతేకాదు.. అశ్లీల వీడియోలు చిత్రీకరించాడు. అప్పటి నుంచి ఆమెను నిత్యం వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. చివరికి అతని టార్చర్ భరించలేక.. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Girl Plan Kill Father: ప్రియుడి కోసం తండ్రికే స్కెచ్ వేసిన కూతురు.. సుపారీ ఇచ్చి మరీ..

బాధిత మహిళ ఫిర్యాదు మేరకు.. గతంలో అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్‌వలీ ఆమెను పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిపించాడు. ఆమెతో సరదాగా మాటలు కలుపుతూ.. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆమె మెల్లగా మత్తులోకి జారిపోయింది. అప్పుడు ఆమెను రూమ్‌లోకి తీసుకెళ్లి, ఆ ఎస్సై ఆమెను అత్యాచారం చేశాడు. ఆమె మత్తులో ఉండటంతో ప్రతిఘటించలేకపోయింది. ఈ మొత్తం తతంగాన్ని అతడు ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆమె అశ్లీల ఫోటోలు తీసి పెట్టుకున్నాడు. మత్తులో నుంచి తేరుకున్నాక.. ఈ విషయం ఎవరికైనా చెప్తే, అశ్లీల చిత్రాలు ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు. వాటిని అడ్డం పెట్టుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ‘నీ వల్లే నా జీవితం నాశనం అయ్యింది కాబట్టి, నన్ను పెళ్లి చేసుకో’ అని ఆమె కోరగా.. అతడు చంపేస్తానని బెదిరించాడు.

Extramarital Affair: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏమైందంటే?

ఇలా ఆ కీచక ఎస్సై తనని టార్చర్ పెడుతుండటంతో.. బాధిత మహిళ సహించలేక గురువారం అర్ధరాత్రి అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని, మోసం చేసిన ఆ కీచక ఎస్సైకు కఠిన శిక్ష విధించాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రమేష్‌బాబు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని, నేరం నిరూపితమై సమందర్ వలీపై చర్యలు తీసుకుంటామన్నారు.

Exit mobile version