పీఆర్సీ పై ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని.. ముఖ్యమంత్రి జగన్ తమ డిమాండ్లు పరిష్కారం చేస్తారనే నమ్మకం ఉందని వెల్లడించారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు. ప్రభుత్వం నుంచి మా డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేకపోవడం నిరసన కార్యాచరణ ప్రారంభించామని.. సీఎస్ నేతృత్వంలో పీఆర్సీ పై నివేదిక వెల్లడించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమస్య ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం కావాల్సిందేనని.. 1-07-2018 నుంచి ఫిట్ మెంట్ ఇవ్వాల్సి ఉండగా… నివేదికలో ఈ ఏడాది నుంచి ఇవ్వాలని ప్రతిపాదించటం మాకు అన్యాయం కలిగించడమేనని తెలిపారు. సీఎస్ ఇచ్చిన నివేదికలో మాస్టర్ స్కేల్స్ లేవని… తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉందన్నారు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ ఇస్తామనటం దుర్మార్గమని.. ఐదేళ్ళకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేవారు. రెండు జేఏసీల పక్షాన ఒక స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేశామని.. ఈ కమిటీ అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుందన్నారు.
