Site icon NTV Telugu

హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ

Balakrishna

Balakrishna

అనంతపురం : హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ… వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని… జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయని ఫైర్‌ అయ్యారు. గత ప్రభుత్వ హాయంలో వ్తెద్య సేవల కోసం తెచ్చిన వ్తెద్య పరికరాలు వాడకుండా మూలన పడివేశారని మండిపడ్డారు బాలకృష్ణ. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై జిల్లా వ్తెద్యఆరోగ్య శాఖ అధికారి, కలెక్టర్‍కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు బాలయ్య.

Exit mobile version