NTV Telugu Site icon

Ayyanna Patrudu: టెన్త్ విద్యార్థులకు ఉచితంగా రీవాల్యూయేషన్ చేయాలి

Ayyanna Patrudu

Ayyanna Patrudu

జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాలతో విద్యార్థుల భవిష్యత్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. టెన్త్‌లో 67.26 శాతం ఉత్తీర్ణతపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 2.70 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు తప్పారని.. బెండపూడిలో ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడిన విద్యార్ధిని సైతం పరీక్షల్లో తప్పడం శోచనీయమన్నారు.

ప్రభుత్వం చేసిన తప్పును తల్లిదండ్రులపై నెట్టే ప్రయత్నం చేయడం ఇంకా పెద్ద తప్పు అని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేయకుండా కాలయాపన చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని చురకలు అంటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరినట్టు టెన్త్ విద్యార్థులకు ఉచితంగా రీవాల్యూయేషన్ చేయాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వం పది మార్కులు గ్రేస్ మార్కులివ్వాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. లోకేష్ విద్యార్థులతో మాట్లాడుతుంటే బూతుల మాజీ మంత్రి నాని మీటింగ్‌లో జాయిన్ అవడం దారుణమన్నారు.

మరోవైపు ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డికి కూడా అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ‘పారిపోయేది మీ నత్తి పకోడీ రెడ్డే వీసా రెడ్డి. బయటకు రావాలి అంటే భయం, ఏ భాష మాట్లాడినా బూతులు, పరదాల చాటున పర్యటించి పారిపోయే నీ అల్లుడికి లండన్ మందులు పని చెయ్యడం లేదు మందులు మార్చు. దమ్ముంటే మీ నత్తి పకోడీ రెడ్డిని లైవులో మాట్లాడమను చూద్దాం ఎవడు మగాడో తెలిపోద్ది’ అంటూ ట్వీట్ చేశారు.