Site icon NTV Telugu

Atchannaidu: కలలో లేచి అసెంబ్లీని రద్దుచేస్తారేమో?

ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు. హనుమాన్ జoక్షన్లో తెలుగు రైతు వర్క్ షాప్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చు. రెండేళ్లు ఉందని నిద్రపోవద్దు.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. రైతులను సీఎం జగన్ సర్కార్ అడుగడుగునా ముంచింది. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి ఒక్క రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసింది.

టీడీపీ హయాంలో రైతుల శ్రేయస్సుకు చేసిన దానిలో పావువంతు అయినా చేశారా? వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును సైతం టీడీపీకి అంటగట్టాలని చూశారు. వివేకానందరెడ్డి హత్య ద్వారా వచ్చిన సింపతితోనే జగన్ సీఎం అయ్యారు. కోడికత్తి డ్రామా సింపతికిపని చేయలేదనే వివేకా హత్యకు తెర తీశారు. హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నారు అచ్చెన్నాయుడు.

సాధారణ ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా టీడీపీకి 150కు పైగా సీట్లు సాధిస్తాయి. కలలో లేచి రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చినా.. ఆశ్చర్య పోనవసరం లేదు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఖాకీ బట్టలను మరిచి పోయారు.చెప్పిన పనులు చేసిన సవాంగ్ ను అన్నా అంటూ సీఎం జగన్ సున్నం పెట్టాడు.ఉద్యోగుల వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయాం.ఉద్యోగులని గౌరవించాం అంటున్నారు.. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. ఉద్యోగులు భయపడో.. ఏదో ప్రలోభాలకు గురయ్యో ఉద్యోగులు లొంగిపోయారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారు.. రైతులకు ఉరితాళ్ళుగా మారింది. దౌర్భాగ్య ముఖ్యమంత్రి హయాంలో రైతులకు యూరియా దొరకడం లేదని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.

https://ntvtelugu.com/ayyanna-patrudu-counter-to-sajjala-on-ys-viveka-murder-case/
Exit mobile version